
సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, ఛత్రపతి శేఖర్, భూషణ్ కళ్యాణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ తషాఫి’. ఈ వెబ్ సిరీస్‌ను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు చెప్పిన మేకర్స్.. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్‌గా రానుందన్నారు. ఇది జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ‘ఇదొక హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్. ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సరికొత్త లొకేషన్స్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాం’ అని ప్రవీణ్ సత్తారు చెప్పాడు.