
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క(Anushka) చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(MissShetty Mr Polishetty). యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen polishetty) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. కొత్త దర్శకుడు మహేష్ బాబు(Mahesh babu) తెరకెక్కించిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్.. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. అక్టోబర్ 5న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. నిజానికి చాలా మంది ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజా అప్డేట్ తో ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్ లో సూపర్ సక్సెస్ అయినా ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.