IPL 2026: ఐపీఎల్కి మరో స్టార్ ప్లేయర్ దూరం.. షాక్లో ఢిల్లీ!

IPL 2026: ఐపీఎల్కి మరో స్టార్ ప్లేయర్ దూరం.. షాక్లో ఢిల్లీ!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-19వ సీజన్ మరో వారం రోజుల్లో స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో జరిగే కొన్ని మ్యాచులకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దూరం కానున్నట్లు సమాచారం. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్లో భాగంగా అతడు సెకెండ్ హాఫ్ లో డీసీ జట్టుతో చేరనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలియజేశాయి. కంగారుల టీమ్ రాబోయే 12 నెలల్లో దాదాపు 21 టెస్ట్ మ్యాచులని ఆడాల్సి ఉండటం.. అదే విధంగా వచ్చే ఏడాది వన్డే  ప్రపంచకప్ ని జరగనుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 

ఏడాది పాటు బిజీ షెడ్యూల్ ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రధాన పేసర్లను లీగ్ క్రికెట్ లో ఎక్కువగా ఆడించి రిస్క్ తీసుకొవద్దని భావిస్తుంది.. ఈ కారణంతోనే అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సీజన్ కి ముందు స్టార్క్ రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. కానీ అతడు ఇప్పుడు అందుబాటులో లేకపోవడం ఫ్రాంచైజీకి పెద్ద ఎదురుదెబ్బ తాగిలే అవకాశం కనిపిస్తుంది. అయితే ఢిల్లీ జట్టులో లుంగి ఎంగిడీ, కైల్ జేమీసన్, దుష్మంత చమీర లాంటి స్టార్ పేసర్లు ఉండడం కాస్త రిలీఫ్ కలిగించే ఆంశంగా చెప్పాలి. 

కాగా మిచెల్ స్టార్క్ ఏప్రిల్ మూడో వారం నాటికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంపై జట్టు యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలవడలేదు. మరోవైపు సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఆరంభ మ్యాచులకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ హైదరాబాద్ జట్టును నడిపించబోతున్నాడు. ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హాజిల్ వుడ్ సైతం ఆడటంపై కూడా సందిగ్ధం నెలకొంది.

ఢిల్లీ క్యాపిటల్స్: 
బ్యాటర్లు: కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ ఫరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్
ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్ 
బౌలర్లు: మిచెల్ స్టార్క్, నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎంగిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్