అహ్మదాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతుతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ అకాడమీ’ ఏప్రిల్ 10న ప్రారంభం కానుంది. ఐదేళ్ల కంటే ఎక్కువ వయసున్న ఔత్సాహిక క్రికెటర్లకు మార్గదర్శకులుగా పలువురు టీమిండియా మాజీ ప్లేయర్లు శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రపంచ స్థాయి శిక్షణా సౌకర్యాలను ఈ అకాడమీ అందించనుంది. ఎస్‌ఆర్‌టీ10 ఆల్టెవోల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ అకాడమీని గతేడాదే ప్రారంభించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో ఇది వాయిదా పడుతూ వస్తోంది. టెక్నిక్, ఫిట్‌నెస్, ప్లేయర్ల నిర్మాణాత్మక వృద్ధి మార్గాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఎస్జీ రోడ్‌లోని వైష్ణోదేవి సర్కిల్ సమీపంలో ఉన్న శంకుస్ ఫామ్‌లో ఈ అకాడమీని నెలకొల్పారు. ప్రొఫెషనల్ క్రికెట్ నెట్స్, ఇన్‌హౌజ్ మ్యాచ్ రెడీ గ్రౌండ్, హై పెర్ఫామెన్స్ జిమ్, రన్నింగ్ ట్రాక్‌లు ఈ అకాడమీలో ఉన్నాయి. అయితే ఎస్‌ఆర్‌టీ10 గ్లోబల్ అకాడమీ ఇప్పటికే నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో పని చేస్తోంది.
