ప్రపంచకప్ టోర్నీలో మిథాలీ రాజ్ అరుదైన రికార్డ్

ప్రపంచకప్ టోర్నీలో మిథాలీ రాజ్ అరుదైన రికార్డ్

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్ లో అత్యధిక మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించి... మిథాలీ రాజ్ రికార్డు సృష్టించింది. కెప్టెన్ గా ప్రపంచకప్ లో 24 వ మ్యాచ్ ఆడుతున్న  ... ఆస్ట్రేలియా లెజెండ్ బెలిండా క్లార్క్ రికార్డును బద్దలుకొట్టింది.అత్యధిక వన్డే మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన రికార్డు కూడా మిథాలీ రాజ్ పేరిటే ఉంది. ఇప్పటివరకు 150 వన్డే మ్యాచ్ లకు మిథాలీ కెప్టెన్ గా వ్యవహరించారు. ఐసీసీ  వన్డే మహిళల ప్రపంచ కప్ లో టీమిండియా మూడో మ్యాచ్ లో వెస్టిండీస్ తో తలపడుతోంది. పాక్ తో మ్యాచ్ నెగ్గిన భారత్... న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. సెమీ ఫైనల్ బెర్త్ కోసం ఈ మ్యాచ్ లో భారత్ నెగ్గాల్సి ఉంది. మరో వైపు వెస్టిండీస్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గింది.
 
మరిన్ని వార్తల కోసం

రాయల్స్​ ఫాస్ట్​ బౌలింగ్​ కోచ్‌‌‌‌గా మలింగ

రష్యాకు వీటో అధికారం రద్దు చేస్తామన్న బైడెన్!