రాయల్స్​ ఫాస్ట్​ బౌలింగ్​ కోచ్‌‌‌‌గా మలింగ

రాయల్స్​ ఫాస్ట్​ బౌలింగ్​ కోచ్‌‌‌‌గా మలింగ

ముంబై: శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగ మళ్లీ ఐపీఎల్ లో కనిపించబోతున్నాడు. ఓ బౌలర్‌‌గా లీగ్‌‌లో తనదైన ముద్ర వేసిన లసిత్​ ఇకపై కోచ్‌‌గా కొత్త ఇన్నింగ్స్‌‌ మొదలు పెట్టబోతున్నాడు.   రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్‌‌ బౌలింగ్ కోచ్‌‌గా మలింగ నియమితుడయ్యాడు. అలాగే సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌‌ పాడీ ఆప్టన్‌‌ను ‘టీమ్‌‌ కేటలిస్ట్‌‌’గా తీసుకున్నట్టు రాయల్స్‌‌ శుక్రవారం ప్రకటించింది.   మరోవైపు ఇంగ్లండ్‌‌ ప్లేయర్‌‌ అలెక్స్‌‌ హేల్స్‌‌ స్థానంలో ఆస్ట్రేలియా లిమిటెడ్‌‌ ఓవర్ల కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌ కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ టీమ్‌‌లోకి వచ్చాడు. బయో బబుల్‌‌ అలసట కారణంగా ఈ సీజన్‌‌కు దూరంగా ఉండాలని భావించిన హేల్స్‌‌ను రిలీజ్‌‌ చేసిన కేకేఆర్‌‌.. ఫించ్‌‌తో  ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది.