V6 News

‘మీతో మా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ

‘మీతో మా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ

ఖైరతాబాద్, వెలుగు: టీయూడబ్ల్యూజే, మెఫీ, హైదరాబాద్ ప్రెస్​క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు సీహెచ్ రాజేశ్వరరావు సంస్మరణ సభ మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు రాసిన ‘మీతో  మా జ్ఞాపకాలు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

చీఫ్​గెస్టుగా హాజరైన తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్​ రావు మాట్లాడుతూ.. రాజేశ్వరరావు నిరంతర అధ్యయన శీలి, మేధావి అని కొనియాడారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సీనియర్ ఎడిటర్ కె.రామచంద్ర మూర్తి, వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ, రాజేశ్వరరావు భార్య అంజని పాల్గొన్నారు.