పీకలదాకా తాగి హోర్డింగ్ ఎక్కిన యువకుడు...భారీగా ట్రాఫిక్ జామ్

పీకలదాకా తాగి హోర్డింగ్ ఎక్కిన యువకుడు...భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ మియాపూర్ లో అర్థరాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. పీకలదాకా తాగి ఫ్లెక్సీ హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో హఫీజ్ పేట ఫ్లై ఓవర్ వద్ద ఉన్న ఫ్లెక్సీ ఎక్కి నిద్రపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు యువకుడిని దింపే ప్రయత్నం చేశారు. కానీ వినకుండా అక్కడే ఉండిపోయాడు. 

యువకుడి తీరుతో హఫీజ్ పేట ఫ్లై  ఓవర్ పై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మియాపూర్ నుంచి కొండాపూర్ కు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు...యువకుడిని కిందకు దింపారు.