మొరాయించిన ఈవీఎం.. ఓటేయకుండానే వెనుతిరిగిన సీఎం

  మొరాయించిన ఈవీఎం..  ఓటేయకుండానే వెనుతిరిగిన సీఎం

మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు గానూ ఓటింగ్ కొనసాగుతుంది.  ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.  ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు జోరంథంగా ప్రయత్నించగా ఈవీఎం మోరయించింది. దీంతో ఆయన ఓటు వేయకుండానే వెనుదిరిగారు.  

ఈ రోజు ఉదయం ఐజ్వాల్‌ నార్త్‌-2 నియోజకవర్గ పరిధిలోని 19-ఐజ్వాల్‌ వెంగ్లాయ్‌-1 పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు జోరంథంగా . అయితే అక్కడి ఈవీఎం పనిచేయకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. కొంతసేపు ఎదురుచూసి వెనుదిరిగారు.  టిఫిన్‌ చేసిన తర్వాత ఓటేసేందుకు మళ్లీ వస్తానని చెప్పారు.  మీడియాతో మాట్లాడిన జోరంథంగా తమ ప్రభుత్వం పూర్తి స్థాయి మోజార్టీ సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలన్నాయి..  ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  8.57లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారు. 1,276 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ నిర్వహిస్తున్నారు.