తెలంగాణ రక్షణ సేన కాదు.. అది ‘రాక్షస సేన’..కవిత పార్టీపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

తెలంగాణ రక్షణ సేన కాదు.. అది ‘రాక్షస సేన’..కవిత పార్టీపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

బాలానగర్, / జడ్చర్ల టౌన్ వెలుగు:   కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ తెలంగాణ రక్షణ సేన కాదని, అది తెలంగాణ రాక్షస సేన అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం రాజాపూర్ మండలం కుచ్చర్కల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జన్మనిచ్చి, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తండ్రిపైనే పోరాడుతున్న కవిత, తెలంగాణ ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో కాళేశ్వరం అవినీతిపై నోరు మెదపని కవిత, ఇప్పుడు అధికారం కోల్పోయాక కేవలం వసూళ్ల కోసమే కొత్త పార్టీ పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు పేద ప్రజల సంక్షేమం కోసం కాకుండా, ప్రజలను దోచుకోవడానికే పుట్టాయని మండిపడ్డారు.