జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రకటించాలి: మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వినతి

జడ్చర్లను రెవెన్యూ  డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రకటించాలి: మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వినతి

 జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్లను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. వీటితో పాటు రాజాపూర్, ఊర్కొండ మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు, జడ్చర్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నూతన భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కావేరమ్మపేటలో మహిళా సంఘాలు పెట్రోల్ పంపు నిర్వహించుకోవడానికి 2,000 గజాల స్థలాన్ని కేటాయించాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే విన్నపాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.