ఎమ్మెల్యేకు కనీస మర్యాదలు ఇవ్వరా

ఎమ్మెల్యేకు కనీస మర్యాదలు ఇవ్వరా

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై వైసీపీ ఎమ్మెల్యే  అన్నా రాంబాబు ఫైర్ అయ్యారు. టీటీడీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని విమర్శించారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని ఎమ్మెల్యే అన్నారాంబాబు దర్శించుకున్నారు. టీటీడీ అధికారుల తీరు వల్ల ఏపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు.

టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీసు అంటే ఈవోకు లెక్కలేకుండా పోతుందని ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. శాసన సభ్యుడికి కనీస మర్యాదలు కూడా ఈవో ధర్మారెడ్డి ఇవ్వడం లేదన్నారు. ధర్నారెడ్డి ఈవోగా కొనసాగాలని ఎలా తపన పడుతున్నారో..అదే విధంగా తమకు కూడా స్వామి వారిని దర్శించుకోవాలన్న కోరిక ఉంటుందన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తిరుమలలో భక్తులందరికి ఒకే నిబంధన అమలు చేస్తే..తాము కూడా సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకుంటామన్నా