- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మోటకొండూర్ మండలం ఆరెగూడెం, దిలావర్ పూర్, మాటూరు, అమ్మనబోలు, తేర్యాల, చామాపూర్, చందేపల్లి, చాడ, ముత్తిరెడ్డిగూడెం, కొండాపూర్, నాంచారిపేట గ్రామాలలో కాంగ్రెస్ సర్పంచ్, వార్డు అభ్యర్థులకు మద్దతుగా శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగులలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల గెలుపునకు క్యాడర్ కృషి చేయాలని సూచించారు.
