బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ

బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ

ధర్పల్లి, వెలుగు : బీసీ రిజర్వేషన్ బిల్లును బీఆర్ఎస్, బీజేపీలు అడ్డుకుంటున్నాయని నిజామాబాద్ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. బుధవారం రామడుగు ప్రాజెక్ట్​నుంచి సాగునీటిని విడుదల చేసి మాట్లాడారు.  బీసీ ఎంపీలు బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్ బీసీ రిజర్వేషన్​పై కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటింగ్ అవకతవకలపై దర్యాప్తు చేయించాలన్నారు. ప్రాజెక్ట్ నిండడానికి ఇంకా పది అడుగులు ఉన్నా రైతుల శ్రేయస్సు కోసం నీటిని  విడుదల చేశామన్నారు. 

 సుద్దులం, రామడుగు, మైలారం, కొరట్ పల్లి, కలిగోట్, చింతలూర్, మనోహరాబాద్ గ్రామాల పొలాలకు సాగునీరు అందనుందన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్ రాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, మిట్టపల్లి గంగారెడ్డి,  సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి ​(ధర్పల్లి), తహసీల్దార్​ శాంత,  డిచ్​పల్లి ప్రెసిడెంట్​ అమృతాపూర్​ గంగాధర్, చెలిమెల శ్రీనివాస్, పుప్పాల సుభాష్, తదితరులు పాల్గొన్నారు.