డి.శ్రీనివాస్ సేవలు మరువలేనవి : ఎమ్మెల్యే డాక్టర్భూపతిరెడ్డి

డి.శ్రీనివాస్ సేవలు మరువలేనవి :   ఎమ్మెల్యే డాక్టర్భూపతిరెడ్డి

నిజామాబాద్​, వెలుగు : కాంగ్రెస్​ పార్టీకి డి.శ్రీనివాస్ మరువలేని సేవలు అందించారని రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​భూపతిరెడ్డి అన్నారు. సోమవారం డి.శ్రీనివాస్​ ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని కంఠేశ్వర్​ చౌరస్తాలో డీఎస్​ విగ్రహానికి ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డితో కలిసి నివాళులర్పించారు.  డీఎస్​ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుతీసుకెళ్తామని తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్​, మార్కెట్ కమిటీ చైర్మన్​ ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, పొలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.  

పుట్టింది, శ్వాస వీడింది కాంగ్రెస్​లోనే.. 

 ఏపీసీసీ ప్రెసిడెంట్​గా డి.శ్రీనివాస్​ ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమని గవర్నమెంట్​ సలహాదారుడు షబ్బీర్​అలీ అన్నారు. ఆయన కాంగ్రెస్​లో పుట్టి అక్కడే తుదిశ్వాస వీడారన్నారు.  సోమవారం డీఎస్​ ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని కంఠేశ్వర్​ బైపాస్​ రోడ్​లో ఏర్పాటు చేసిన విగ్రహానికి నివాళులర్పించారు.

అప్పులు భరిస్తూ హామీల అమలు

బీఆర్​ఎస్​ సర్కార్​ పదేండ్ల అప్పులు భరిస్తూ ప్రజలికిచ్చిన హామీలు అమలు చేస్తున్నామని షబ్బీర్అలీ అన్నారు.  నగరంలోని నాందేవ్​వాడ, టెలిఫోన్​ కాలనీ, గోశాల, సతీష్​నగర్​, ఆటోనగర్​ కాలనీకి చెందిన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రొసీడింగ్స్​ పంపిణీ చేశారు. స్టేట్​ కోఆపరేటివ్​ లిమిటెడ్​ చైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, నుడా చైర్మన్​ కేశవేణు పాల్గొన్నారు.