
జీడిమెట్ల, వెలుగు: బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిందని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కుత్బుల్లాపూర్‌లో ఆయన రోడ్‌షో నిర్వహించగా.. కార్యకర్తలు, జనం భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల మాయ మాటలను నమ్మొద్దన్నారు. కుత్బుల్లాపూర్‌లో కనీస అవసరాలైన నీరు, డ్రైనేజీ, రోడ్లు సక్రమంగా లేవన్నారు. తనను గెలిపిస్తే ఈ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. పేదల ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్అని, హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.