ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆర్మూర్, వెలుగు :  అభివృద్ధి, సంక్షేమంపై  తనతో బహిరంగ చర్చకు రావాలని  ఎంపీ  అర్వింద్​కు ఆర్మూర్​ ఎమ్మెల్యే  జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.   మంథని, పిప్రి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు.  మామిడపల్లి వద్ద ఆర్​వోబీ పనులను పరిశీలించి మాట్లాడారు. 2016 లో సీఎం కేసీఆర్  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి ఆర్ వోబీని మంజూరు చేయించారని, అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవ తీసుకొని రూ.25 కోట్లు విడుదల చేయించి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. పెండింగులో ఉన్న ఆర్​వోబీ పనులను వచ్చే ఏప్రిల్​ వరకూ పూర్తయ్యేలా ఆఫీసర్స్​ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఆర్​వోబీ విషయంలో ఎంపీ చేసిందేమిలేదని విమర్శించారు. ఆర్మూర్ అభివృద్ధి లో తాను రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు. టూరిజం స్పాట్ గా పిప్రి కుడి చెరువును డెవలప్​ చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సర్పంచ్  ఆసపురం దేవి శ్రీనివాస్ రెడ్డి, లింబారెడ్డి, సొసైటీ చైర్మన్ హేమంత్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ అకడమిక్​ నుంచే మెడికల్​ కాలేజీ తరగతులు  

  •   జిల్లా పర్యటనలో మంత్రి హరీశ్​రావు
  •   పిట్లంలో 30 బెడ్ల ఆస్పత్రికి శంకుస్థాపన

కామారెడ్డి/పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందని మంత్రి హరీశ్​రావు తెలిపారు. శనివారం ఆయన జిల్లాలో పర్యటించారు.   పిట్లంలో  30   బెడ్ల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.   బిచ్​కుందలో డయాలసిస్​ సెంటర్​ను,  కొత్తగా డొంగ్లీ మండలాన్ని ఆయన ప్రారంభించారు.  ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్​రావు మాట్లాడారు.  ధరణిపై  కొందరు  తెలియకుండా మాట్లాడుతున్నారని,  దానితో  అవినీతి  తగ్గి, పారదర్శకత, వేగవంతమైన పాలన పెరిగిందన్నారు.  అగ్రీకల్చర్​ బోర్లకు మీటర్లు పెట్టలేదని  కేంద్రం  రూ.12 వేల కోట్ల ఫండ్స్​, ఎఫ్​ఆర్​బీఎం పేరిట రూ.15వేల కోట్ల ఫండ్స్​  ఆపేశారని విమర్శించారు.   బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభి వృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో ప్రజలు గ్రహించాలన్నారు.  మహరాష్ర్ట, కర్నాటక  సరిహద్దులో ఉన్న కామారెడ్డి జిల్లా ప్రజలు  ఆ  ప్రాంతా లను గమనించాలని సూచించారు. అక్కడ విద్య, వైద్యం వెనుక బడిఉన్నాయన్నారు. నాందేడ్​ జిల్లాకు చెందిన పలువురు సర్పంచులు వచ్చి  అక్కడి గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరినట్టు చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి రోల్​ మాడల్​గా  నిలిచిందని, తెలంగాణ పథకాలు బీజేపీ కాపీ కొడుతోందని అన్నారు.  చిల్లర్గి, మహమ్మదాబాద్​ల్లో పీహెచ్​సీలను ఏర్పాటు చేస్తామని,  మద్నూర్​ ఏరియాలకు లిప్ట్ ఇరిగేషన్​ కోసం  సీఎంతో మాట్లాడుతానని  మంత్రి హామీ ఇచ్చారు. జుక్కల్ నియోజక వర్గంలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు.  జుక్కల్​ ఎమ్మెల్యే హన్మంతుషిండే  జహీరాబాద్​ ఎంపీ బీబీపాటిల్​, జడ్పీ చైర్​పర్సన్​ దఫేదర్​ శోభ,  ఎమ్మెల్సీ వీజీగౌడ్, కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​,  ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​ తదితరులు పాల్గొన్నారు.  

మంచి భవిష్యత్తుకు చదువు ఎంతో ముఖ్యం

కామారెడ్డి , వెలుగు:  మంచి భవిష్యత్తు పొందాలంటే చదువు ఎంతో అవసరం అని ప్రభుత్వ విప్​ గంప గోవర్దన్​ అన్నారు.   బీబీపేట మండల కేంద్రంలోని తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి  జడ్పీ హైస్కూల్​ మొదటి వార్షికోత్సవం శనివారం  నిర్వహించారు.  డైనింగ్​ హాల్, వాటార్​ ప్లాంట్​ను  గంప గోవర్దన్​, కలెక్టర్​ జితేశ్​​ వి పాటిల్​,  మధ్య ప్రదేశ్​ సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్​  నరహరి  ప్రారంభించారు.  గంప గోవర్దన్​ మాట్లాడుతూ..   మంచి భవిష్యత్తు ఉండాలంటే, చదువు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.  కార్పొరేట్​  స్కూల్​కు మించిన వసతులు ఇక్కడి స్కూల్​లో  సమకూర్చడం అభినందనీయం అన్నారు.   ఈ కార్యక్రమంలో  ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి,  జడ్పీ వైస్​ చైర్మన్​ ప్రేమ్​కుమార్​,  ఎంపీపీ బాలమని, స్కూల్​ నిర్మాణ దాత తిమ్మయ్యగారి సుభాస్​రెడ్డి,   గాయకుడు మిట్టపల్లి సురేంధర్,  మాలవత్​ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.