సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురిని కలిసి వినతిపత్రాలు అందించారు. తాగునీరు, రహదారుల రిపేర్, పెండింగ్ డెవలప్మెంట్పనులు, రైతుల సమస్యలను వారికి వివరించారు. ఫసల్వాది, కంది, ఇంద్రకరణ్, ఆరుట్ల గ్రామాల్లో ల్యాండ్‌పూలింగ్‌లో భూములు కోల్పోయిన రైతులకు రైతుబీమా, రైతు భరోసా రావడం లేదన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని విన్నవించారు.
