వివాదంలో ఎమ్మెల్యే దానం

వివాదంలో ఎమ్మెల్యే దానం

సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్

ఖైరతాబాద్, వెలుగు: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ కవితతో కలిసి ఖైరతాబాద్ మహా గణపతికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో నాగేందర్ చెప్పులు వేసుకుని ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. టీఆర్ఎస్ లీడర్లకు హిందూ దేవుళ్లపై భక్తి గానీ, గౌరవం గానీ లేవని నెటిజన్లు మండిపడుతున్నారు.