
- అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్, వెలుగు: అర్బన్ సెగ్మెంట్లో మూడు నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకుంటే నిరాహార దీక్ష చేస్తామని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. గురువారం బీజేపీ జిల్లా ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించి పంపిణీ చేయని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రిపేర్లు చేసి పేదలకు కేటాయించాలన్నారు.
ఇండ్ల నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీం కింద ఆర్థిక సాయం అందుతున్నందున ప్రధాని మోదీ ఫొటో, పేరు ఇండ్లపై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్రవంతిరెడ్డి, లక్ష్మీనారాయణ, న్యావనంది గోపాల్ తదితరులు ఉన్నారు.