రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్
  • ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్​
  • బండ లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే  

కందనూలు, వెలుగు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్​అన్నారు.  సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధవారం నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో అంతర్రాష్ట్ర బండ లాగుడు పోటీలను ఎమ్మెల్యే  ప్రారంభించారు. మైదానంలో ఎద్దులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు నూతన ఉత్సాహాన్ని కలిగించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ పోటీలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లిలో గుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 

రంగాపూర్ లో బండ లాగుడు పోటీలు..

వంగూరు, వెలుగు : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బుధవారం వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో కాడెద్దులతో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను గ్రామ సర్పంచ్ క్యామ మల్లయ్య ప్రారంభించారు.  అనంతరం ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు రూ.30 వేలు అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు గుణగున్న ఆనంద్ రెడ్డి, నరసింహారెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.