ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ తో పర్యావరణానికి మేలు : ఎమ్మెల్యే మట్టారాగమయి

ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ తో పర్యావరణానికి మేలు : ఎమ్మెల్యే మట్టారాగమయి

సత్తుపల్లి, వెలుగు: ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ వినియోగంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. సోమవారం స్థానిక చెర్రీస్ బాంకెట్ హాల్‌లో ఏ ఇన్నోవేషన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సోమవారం మేనేజింగ్ డైరెక్టర్ జగం అశ్వినితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.  ఏ ఇన్వేషన్స్ అందిస్తున్న ఆర్గానిక్ ప్యాడ్స్ ను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా,  సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. 

కార్యక్రమంలో ఎంఈఓ ఎం. రాజేశ్వరరావు, సీడీపీఓ మెహరున్నీసా బేగం, తోట సుజలా రాణి, పలు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు కొనకళ్ల సుధారాణి, గాదె నరసింహారెడ్డి, వలపర్ల రవి, ఇనపనూరి రాధాకృష్ణ, కామెర్ల క్రాంతి, జొన్నలగడ్డ రాజు, జంగా సత్యనారాయణ, గట్టె వాసు, కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నారావు, దొడ్డ శ్రీనివాసరావు, కమల్ పాషా పాల్గొన్నారు.