రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలి..బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలి..బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య నోరు జారారు. రైతుల ఆత్మహత్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు చావాలంటూ వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమ సభలో పాల్గొని రైతుల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు. 

Also Read :- 40 మంది విద్యార్థులతో కుంటలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

ఏమన్నారంటే..

దేశానికి అన్నం పెట్టే రైతులు ఆకలతో చావొద్దు..రైతులు ఆత్మహత్య చేసుకొని చావాలి అని  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నోరుజారారు.  ప్రస్తుతం దుర్గం చిన్నయ్య చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రైతులు చావాలన్న దుర్గం చిన్నయ్య వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు, ప్రజలు మండిపడుతున్నారు.