40 మంది విద్యార్థులతో కుంటలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

40 మంది విద్యార్థులతో కుంటలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

వికారాబాద్ జిల్లాలో స్కూల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. సుల్తాన్ పూర్ లో న్యూ బ్రిలియంట్ స్కూల్ బస్సు అదుపు తప్పి కుంటలోకి దూసుకెళ్లింది. బస్సు స్టీరింగ్ పనిచేయకపోవడంతో  కుంటలోకి స్కూల్ బస్సు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వారిని స్థానికులు కాపాడారు. బస్సు కుంటలోకి దూసుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. 

బస్సులు బాగాలేవని  ఎన్ని సార్లు కంప్లెంట్ చేసినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోవకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడుతున్నారు. ఫెట్ నెస్ లేని బస్సులు నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు.