ఓట్ చోరీ.. నీట్ లీక్లు..ప్రజాస్వామ్యంపై దాడులు చేయడమే బీజేపీ పాలన

ఓట్ చోరీ.. నీట్ లీక్లు..ప్రజాస్వామ్యంపై దాడులు చేయడమే బీజేపీ పాలన
  •     రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆదిలాబాద్, వెలుగు: దేశంలో ఓట్ల చోరీ.. పేపర్ల లీకులు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్  అయ్యారు. ఆదిలాబాద్  జిల్లా పర్యటనలో భాగంగా శనివారం కలెక్టరేట్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 12 ఏండ్ల మోదీ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సర్​ పేరుతో ఓట్లను చోరీ చేస్తున్నారని విమర్శించారు. 

మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో మీనాక్షి నటరాజన్  నామినేషన్‌‌‌‌‌‌‌‌ను ఏకపక్షంగా తిరస్కరించడం సీటు చోరీకి నిదర్శనమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటోందని, ఇందుకు నిదర్శనమే నీట్  పేపర్  లీకేజీ అని తెలిపారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. 

రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  విధ్వంసకర పాలన, 30 నెలల కాంగ్రెస్  పాలనపై అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందాలతో పని చేస్తున్నాయని విమర్శించారు. తుమ్మిడిహట్టి పూర్తయితే ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

 కుంటాల, పొచ్చెర జలపాతాలు, కవ్వాల్  టైగర్  రిజర్వ్‌‌‌‌‌‌‌‌ను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో 69 ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్  రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎస్పీ అఖిల్  మహాజన్ తో కలిసి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారిని సన్మానించి టాస్క్  సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్  శంకర్, మున్సిపల్  చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ బండారి అనూష, ఏఎంసీ చైర్మన్  శ్రీకాంత్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్  నర్సయ్య పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

నిర్మల్: మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. నిర్మల్ లో ఎల్వీ ప్రసాద్  కంటి దవాఖాన ఆధ్వర్యంలో కూచాడి సత్యమ్మ–ప్రకాశ్ రావు స్మారకార్థం ఏర్పా టు చేసిన కంటి పరీక్ష కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ముందుగా మాజీ మంత్రి నర్సారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కంటి పరీక్ష కేంద్రం దాత కూచాడి శ్రీహరిరావు, మున్సిపల్  వైస్  చైర్​పర్సన్  అప్పాల గణేశ్  చక్రవర్తి పాల్గొన్నారు.