తెలంగాణ గడ్డపై బీజేపీ ప్రభుత్వం రాబోతుంది

తెలంగాణ గడ్డపై బీజేపీ ప్రభుత్వం రాబోతుంది

తెలంగాణ సీఎం కేసీఆర్ ను నమ్మితే గోస పడుతారని రాష్ట్ర ప్రజలకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. తెలంగాణ గడ్డపై బీజేపీ ప్రభుత్వం రాబోతోందని, కేసీఆర్ ని ఓడగొట్టాలని ప్రతీ గ్రామం నిశ్చయంతో ఉందన్నారు. మంగళవారం భూపాలపల్లిలో ఈటల మీడియాతో మాట్లాడారు. వరదల వల్ల ముంపు గ్రామాల ప్రజలు సర్వస్వం కోల్పోయినట్లు, ముంపు బాధితుల నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 27 లక్షల క్యూసెక్కుల వరదలకు భారీగా నష్టం వచ్చిందన్నారు. వరదల సమయంలో అధికారులు విదేశాలకు వెళ్ళినట్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది సంభవించిందని విమర్శించారు. SRSP నుంచి భద్రాచలం వరకు పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయినట్లు, ముంపు బాధితులకు సరైన సహకారం అందట్లేదని తెలిపారు. 

ఇతరుల మీద నెపం నెట్టి సీఎం తప్పించుకుంటున్నరు.. కేంద్రాన్ని సహాయం కోరాం, తప్పకుండా సహాయం చేస్తుందన్నారు. వరద సహయంపై కేసిఆర్ ఉత్తుత్తి హామీలు ఇచ్చారని విమర్శించారు. తానే ఇంజనీర్ అని అనుకొనే సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ముంపునకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 139 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోస్తే, రూ. 3080 కోట్లు కరెంట్ బిల్లు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఇంజనీర్ల మాటలు విని కాళేశ్వరంలో 3వ టీఎంసీ నిర్ణయం సీఎం కేసిఆర్ మానుకోవాలని హితవు పలికారు. వరదలను స్టడీ చేసి.. శాశ్వత పరిష్కారం చూడాలని ఎమ్మెల్యే ఈటల ప్రభుత్వానికి సూచించారు.