బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరచాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరచాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కొత్తపల్లి, వెలుగు: బీసీలకు 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చాలని మాజీ మంత్రి, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​డిమాండ్ చేశారు. సోమవారం కొత్తపల్లి మండలం రేకుర్తి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో రూ.25 లక్షలతో ఆలయాన్ని అభివృద్ధి చేశామని, దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి మిగతా అభివృద్ధి పనులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ రెండు పార్టీల మధ్య బీసీలు నలిగిపోతున్నాయన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేదాకా ఢిల్లీలో ఉండి పోరాడాలని, అందుకు తాము కూడా అండగా ఉంటామన్నారు. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో మోదీ, చంద్రబాబు విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తున్నారని, తెలంగాణను తిరిగి ఏపీలో కలిపేందుకు జరిగే కుట్రలో భాగంగానే సీఎం రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుట్టింది తెలంగాణ కోసమని, ఏ పార్టీలో కలిసేది లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఏనుగు రవీందర్ రెడ్డి, మాధవి--, ఏదుల్ల రాజశేఖర్, సూర్యశేఖర్, నేతి రవివర్మ, బీఆర్ఎస్ కొత్తపల్లి మండల అధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్ గౌడ్, చందు, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పాల్గొన్నారు.