రెండు నెలల్లోగా బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలి : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

రెండు నెలల్లోగా బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలి : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
  • కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కొత్తపల్లి, వెలుగు: రెండు నెలల్లో ఎలగందల్​ బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి, కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్​ చేశారు. ఎలగందల్ పాత రోడ్డు బ్రిడ్జి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. 

అనంతరం అధికారులతో సమీక్ష చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము కొత్త రోడ్లు అడగట్లేదని, పాత వాటిని పూర్తిచేయమంటున్నారు. బావుపేట వద్ద రోడ్డు పాడై వాహనదారులు ఇబ్బంది పడుతున్నా కేంద్ర, రాష్ట్ర పాలకులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు.