కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని 45వ డివిజన్ మంకమ్మ తోటలో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. ఆదివారం మంకమ్మతోటలోని రోడ్డు నంబర్ 4లో రూ.7లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు చొరవ తీసుకుని పైప్‌లైన్ పనులు వేగంగా పూర్తి చేయించాలన్నారు. అనంతరం డివిజన్ వాసులు సన్మానించారు. మైనార్టీ నగర శాఖ అధ్యక్షుడు షౌకత్ అలీ, లీడర్లు దిండిగాల మహేశ్, గుగ్గిళ్ల జయశ్రీ, కర్రె సూర్యశేఖర్ పాల్గొన్నారు
