విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రతిభ చూపాలి :ఎమ్మెల్యే గొంగిడి సునీత

విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రతిభ చూపాలి :ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదాద్రి, వెలుగు : స్టూడెంట్లు తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకొని ధైర్యంగా ముందుకు నడవాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా రాయగిరిలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌‌‌‌‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌ అవార్డుల ప్రదర్శన, పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఇలాంటి ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయన్నారు. ప్రతి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని సూచించారు. జిల్లాలోని 15 స్కూళ్లకు చెందిన స్టూడెంట్లు 233 సెన్స్‌‌‌‌‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌, 85 ఇన్‌‌‌‌‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌ ప్రయోగాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎలిమినేటి సందీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌ తివారి, డీఈవో నారాయణరెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల పాల్గొన్నారు. 

సూర్యాపేటలో ముగిసిన సైన్స్‌‌‌‌‌‌‌‌ ఫెయర్‌‌‌‌‌‌‌‌

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలో జరుగుతున్న జిల్లా స్థాయి సైన్స్‌‌‌‌‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ప్రదర్శించేందుకు జూనియర్‌‌‌‌‌‌‌‌ విభాగంలో 7, సీనియర్‌‌‌‌‌‌‌‌ విభాగంలో 7, రాష్ట్రస్థాయి ఇన్స్‌‌‌‌‌‌‌‌పైర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ కోసం 4 ఎగ్జిబిట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన స్టూడెంట్లకు మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ అన్నపూర్ణ ప్రైజ్‌‌‌‌‌‌‌‌లు అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి దేవరాజు, ఏడీ శైలజ, సుధాకర్‌‌‌‌‌‌‌‌ పీవీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మీలా మహదేవ్, మీలా వాసుదేవ్, కో ఆర్డినేటర్స్ చంద్రునాయక్, ఎన్. రవి పాల్గొన్నారు.