- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ఇసుకబావిలోని మల్లన్న దేవాలయ ఆవరణలో గదులు, షెడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు వందలకు పైగా ఆలయాలు నిర్మించినట్లు చెప్పారు. అనంతరం స్థానిక నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. మున్సిపల్మాజీ వైస్ చైర్మన్నర్సింహాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, తులసిరెడ్డి, దామోదర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
