
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి క్షమాపణ చెప్పారు. అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను బయట మాట్లాడడం తన తప్పేనని ఆయన అన్నారు. ఇందులో రేవంత్ పొరపాటు ఏమీ లేదని, తనవైపు నుంచి మరోసారి ఇలా జరగబోదని వివరణ ఇచ్చారు. రేవంత్‌రెడ్డిది, తనది అన్నదమ్ముల పంచాయితీ అని, కేడర్ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదన్నారు. శనివారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, మల్లు రవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా, రాహుల్ డైరెక్షన్‌లోనే పనిచేస్తూ.. టీఆర్‌ఎస్, బీజేపీపై తమ యుద్ధం కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్ నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.