ములకలపల్లి మండలలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే జారే ఆది నారాయణ

 ములకలపల్లి మండలలో  మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి :  ఎమ్మెల్యే జారే ఆది నారాయణ
  • క్రీడామంత్రికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే జారే 

అశ్వారావుపేట, వెలుగు: రాష్ట్ర  క్రీడామంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్​చార్జి వాకిటి శ్రీహరిని ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎమ్మెల్యే జారే ఆది నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేలా ములకలపల్లి మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే జారే తెలిపారు.