ప్రజారోగ్యమే లక్ష్యంగా వైద్య శిబిరాలు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ప్రజారోగ్యమే లక్ష్యంగా వైద్య శిబిరాలు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట/దమ్మపేట వెలుగు: అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో ప్రజల ఆరోగ్యాలను కాపాడటమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. గురువారం దమ్మపేట మండలం గండుగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేసి, చికిత్సలపై అవగాహన కల్పించారు. అంతకుముందు గ్రామంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారి హెల్త్ విషయంలో ఆర్థిక సమస్యలను తొలగించడం కోసమే ఇలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేస్తే సంపూర్ణంగా నయం చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, సీఐ పింగళి నాగరాజు, వసంతరావు, శ్రీను, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.