కిడ్నాప్‎ల గురించి మాజీ మంత్రికి ముందే ఎలా తెలుసు?

కిడ్నాప్‎ల గురించి మాజీ మంత్రికి ముందే ఎలా తెలుసు?

ఒక రాష్ట్ర మంత్రి హత్యకు కుట్ర చేయడం దారుణమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రచేసిన వ్యక్తులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎలా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. అసలు జితేందర్ రెడ్డికి వారికి సంబంధం ఏంటని ఆయన నిలదీశారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘కిడ్నాప్‎ల గురించి మాజీ మంత్రి డీకే అరుణకు ముందే ఎలా తెలుసు? మా ప్రభుత్వం ఇలాంటి చర్యలను, కుట్రలను ఉపేక్షించేదు. దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేయడం సిగ్గు చేటు. సెక్షన్ 212 ప్రకారం నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారు కూడా దోషులే. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై కేసులు పెట్టాలని డీజీపీ, సీపీలను కోరుతున్నాను. దోషులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గు చేటు. తెలంగాణలో ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు నడవవు’ అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

For More News..

ఫొటో స్టోరీ: యువతకు గన్ కాల్చడం నేర్పుతున్న ఉక్రెయిన్ సైన్యం

పాక్ విద్యార్థులను కాపాడిన భారత జెండా