
- 12 మంది చాలన్న మంత్రి శ్రీధర్ బాబు
- స్టార్టయినప్పుడు 10 మందే ఉన్నరన్న కడియం
హైదరాబాద్: అసెంబ్లీలో కోరం లేదని, ఈ సమయంలో బడ్జెట్ పై చర్చ చేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దీనిపై శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. ప్రస్తుతం సభలో 18 మంది ఉన్నారని, 10 శాతం అంటే 12 మంది ఉంటే చాలని నిబంధనలను వివరించారు.
దీనిపై కడియం శ్రీహరి మాట్లాడతూ సభ ప్రారంభ సమయంలో కేవలం 10 మందే ఉన్నారని చెప్పారు. తాను బడ్జెట్ పై గంట మాట్లాడుతానని సంబంధిత ఫైనాన్స్ మినిస్టర్ అందుబాటులో లేరని సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని, కాసేపట్లో వచ్చి జాయిన్ అవుతారని, సమాధానం కూడా చెబుతారని తెలిపారు.