ఇందిరను కలిసిన కడియం

ఇందిరను కలిసిన కడియం

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరను వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డితో కలిసి స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య శుక్రవారం హైదరాబాద్​లో ఆమె ఇంట్లో కలిశారు సింగపురం ఇందిర వారిని ఆహ్వానించి, శాలువాలతో సన్మానించారు. నేడు తుక్కుగూడలో జరుగనున్న జనజాతర సభ కోసం స్టేషన్​ఘన్​పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను తరలించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సింగపురం ఇందిరతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చర్చించారని కాంగ్రెస్ ముఖ్య నాయకులు తెలిపారు.