
కేసీఆర్, కేటీఆర్ లకు విలువలు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మల్యే కడియం శ్రీహరి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మొదట ఉల్లంఘించిందే బీఆర్ఎస్ పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కడియం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.
ఉప ఎన్నికలు ఎప్పడనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పిన కడియం.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని అన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.
►ALSO READ | గొర్రెల స్కాం 1,000 కోట్లు! నిర్ధారణకు వచ్చిన ఈడీ
పార్టీలను, ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని మండిపడ్డారు.