మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : ఎమ్మెల్యే కసిరెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆమనగల్లు పట్టణంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీ లను కైవసం చేసుకుని కాంగ్రెస్ జెండాను ఎగర వేస్తామని చెప్పారు.

ప్రతిపక్షాలు ప్రలోభాలకు గురిచేసిన ఓటర్లు లోనుకాకుండా మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, రాష్ట్రంలో  ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు పలికారని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నిట్ట నారాయణ, జగన్, ప్రభాకర్ రెడ్డి, శ్రీశైలం, అనంతరెడ్డి, రమణారెడ్డి, నరసింహరెడ్డి, అప్పం శ్రీను, మహేశ్ ​తదితరులు పాల్గొన్నారు.