ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 

ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 
  • ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 

బెజ్జంకి, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారమైందని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని పైలెట్ వీరాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల  గృహప్రవేశాలకు ఎమ్మెల్యే పూజలు చేసి మాట్లాడారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్​ సర్కార్​ధ్యేయమన్నారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాకే ఎన్నో ఎండ్లు ఇండ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదన్నారు.  గత పాలకులు పల్లెలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడ్డాయన్నారు.  అనంతరం 21 మంది లబ్ధిదారులకు రూ.37 లక్షల 4వేల 300 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో కడివేలు ప్రవీణ్, కాంగ్రెస్​ లీడర్లు ఒగ్గు దామోదర్, రత్నాకర్ రెడ్డి, చెప్పాల శ్రీనివాస్ గౌడ్, బైర సంతోష్ తదితరులు పాల్గొన్నారు.