చండూరు/నాంపల్లి/వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలను కోరారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నియోజకవర్గంలోని చండూరు మండలంలో బోడంగిపర్తి, తాస్కాని గూడెం, చామలపల్లి గ్రామాలతోపాటు నాంపల్లి మండలంలోని నరసింహుల గూడెం, రాందాస్ తండా, పెద్దాపురం, నాంపల్లి, తిరుమలగిరి, కేతపల్లి, తుంగపాడు మల్లపురాజుపల్లి, టిపీ గౌరారం, వడ్డేపల్లి, గ్రామంతో పాటు నాంపల్లి మండల కేంద్రం, మర్రిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాలు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

