ఝరాసంగం, వెలుగు: మండల కేద్రంలోని బుడగ జంగం కాలనీ వాసులు తాగు నీటికి ఇబ్బందులు పడుతుండడంతో ఆదివారం ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు బోరు వేయించి సమస్యను పరిష్కరించారు. అనంతరం గంగాపూర్ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, సర్పంచ్ వినోదాబాల్రాజ్, మాజీ సర్పంచ్ జగదీశ్వర్, వార్డు సభ్యలు నవీన్‌కుమార్, సంగమేశ్వర్, ప్రకాశ్‌సింగ్, తేజమ్మ, నాయకులు సంతోష్కుమార్పటేల్, వెంకటేశం, నర్సంహాగౌడ్, ఎజాజ్బాబ, అనిల్, సజ్జన్షెట్టి, బస్వరాజ్, గోపాల్ పాల్గొన్నారు.
