రాహుల్ తల తేవాలనడం దారుణం : కూనంనేని

రాహుల్ తల తేవాలనడం దారుణం :  కూనంనేని
  • తలలు తెచ్చే కల్చర్ ఎవరిదో బీజేపీ చెప్పాలి: కూనంనేని 

హైదరాబాద్, వెలుగు: దేశంలో మతస్వేచ్ఛపై వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తల తీసుకురావాలని బీజేపీ నేతలు పిలుపునివ్వడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసలు తలలు తీసుకొచ్చే కల్చర్ ఎవరిదో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.

శనివారం హైదరాబాద్​లోని సీపీఐ స్టేట్ ఆఫీస్ మగ్దూంభవన్​లో పార్టీ నేతలు పల్లా వెంకట రెడ్డి, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు, ఎన్.బాలమల్లేష్, కలవేణ శంకర్, ఎం.బాలనర సింహాతో కలిసి కూనంనేని మీడియాతో మాట్లాడారు.

బీజేపీ నేతలవి చౌకబారు రాజ కీ యాలు అని, వారి వ్యాఖ్యలు ఉగ్రవాదాన్ని ప్రేరే పించేలా ఉన్నాయన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోకుండా రాహుల్ ఒక టెర్రరిస్ట్ అంటూ కేంద్ర మంత్రి మాట్లాడటం సరికాదన్నారు.

హైడ్రా అంటే.. పెద్ద పెద్ద ఆక్రమణదారులకు భయం ఉండాలి కానీ పేదల్లో అభద్రతాభావం రాకూడదని కూనంనేని అన్నారు. వర్సిటీలకు తెలంగాణ పోరాటయోధుల పేర్లు పెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.