- ఎమ్మెల్యే కోరం కనకయ్య
కామేపల్లి, వెలుగు : గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. మండలంలోని మద్దులపల్లిలో సోమవారం క్రిస్టియన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
