
- సీఎం రేవంత్ సారీ చెప్పాలి
- బీఆర్ఎస్ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్
హైదరాబాద్: గేట్లు తెరిస్తే రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలం కాదని శాసనసభ సభ్యుడు కేపీ వివేకానంద్ గౌడ్అన్నారు. సీఎం రేవంత్ వెంటనే తమ ఎమ్మెల్యేలకు సారీ చెప్పాలని డిమాండ్చేశారు. తెలంగాణ భవన్ లో వివేకానంద్మీడియాతో మాట్లాడుతూ ..‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ఇన్సెక్యూరిటీతో ఉన్నరు. కాంగ్రెస్ పార్టీ నేతలే మా ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలువని పరిస్థితి అంటున్నరు. హస్తం పార్టీలో నుంచే ఏక్ నాథ్ షిండేలు వస్తారని బీజేపోళ్లు అంటున్నరు. '
రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూల్తుందోనని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. పాలన సరిగ్గా చేయలేక ఎంపీ ఎన్నికలతో పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నరు. చారానా పనులకు బారాణా ప్రచారం చేయించుకుంటున్నరు. సీఎం అజ్ఞాన, అరాచన మాటాలు మానుకోవాలి’ అని సూచించారు.