'వైడ్రా' వస్తేనే ఆక్రమణలకు చెక్‍ : ఎమ్మెల్యే కేఆర్‍ నాగరాజు

'వైడ్రా' వస్తేనే ఆక్రమణలకు చెక్‍ : ఎమ్మెల్యే కేఆర్‍ నాగరాజు

వరంగల్‍/ కాజీపేట, వెలుగు: హైదరాబాద్‍ నగరంలో హైడ్రా మాదిరి, గ్రేటర్‍ వరంగల్‍ నగరానికి 'వైడ్రా' తీసుకురావాలని, అప్పుడే ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు సేఫ్​గా ఉంటాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍ నాగరాజు కోరారు. మంగళవారం గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍తో కలిసి ఆయన 46వ డివిజన్​లో బయో మైనింగ్‍ ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గ్రేటర్‍ వరంగల్​లోని మడికొండ డంపింగ్‍ యార్డ్​ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట విలీన గ్రామాల నుంచి జనాల నుంచి అధికంగా రెవెన్యూ, స్టాంప్‍ డ్యూటీల రూపంలో టాక్సులు వెళ్తున్నాయని చెబుతూ బల్దియా అధికారులు విలీన గ్రామాల అభివృద్ధికి 1/3 నిధులు కేటాయించాలన్నారు.