మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హసన్ పర్తి/ వర్ధన్నపేట, వెలుగు: వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధి తమ జీవిత లక్ష్యమని, ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పాలన అందించడమే తన బాధ్యత అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రంతోపాటు దేవన్నపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధాకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, ఆరోగ్యం, క్రీడా వసతులు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి డివిజన్‌లో సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, ఆత్మకూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో ఓపెన్​ జిమ్​కు శంకుస్థాపన చేశారు.