- ఎమ్మెల్యే కూనంనేని
ముషీరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో చేనేత సమస్యలపై నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీలు ఎల్. రమణ, నెల్లికంటి సత్యం, తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులుతో కలిసి పాల్గొని, మాట్లాడారు. వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన చేనేత రంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
చేనేత కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్‌లో చేనేతకు టెక్స్టైల్స్, పవర్‌లూమ్ లకు వేర్వేరుగా రూ. 2 వేల కోట్ల చొప్పున కేటాయించాలని, ఇందుకు బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేతన్నల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేసి, జీరో వడ్డీతో కొత్తగా రూ. 5 లక్షల రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనం శాంతి, పాలడుగు భాస్కర్, రమేశ్, కూరపాటి రమేశ్తదితరులు పాల్గొన్నారు.
