హాలియా, వెలుగు : వ్యాయామం చేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హాలియా మున్సిపాలిటీ, తులసి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ ను యన ప్రారంభించారు.
పట్టణంలోని తులసి హాస్పిటల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ రన్ కొనసాగగా, పాల్గొన్న వారికి పౌష్టికాహారం పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించి రోగులకు మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం కొంత సమయం వ్యాయామానికి కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
