ఎమ్మెల్యే లాస్య నందిత కారు డ్రైవర్పై కేసు నమోదు

ఎమ్మెల్యే లాస్య నందిత కారు డ్రైవర్పై కేసు నమోదు

ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్ చెరు పోలీసులు కారు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. 304 ఏ ఐపీసీ సెక్షన్ కింద ఆకాష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఉదయం 5.15 గంటలకు ఆకాష్ ఫోన్ చేశాడని.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడని నివేదిత తెలిపింది. తాము వెళ్లి చూసేసరికి కారు నుజ్జు నుజ్జు అయిందని పేర్కొంది. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు లాస్య సోదరి నివేదిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ORR పై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారును.. డ్రైవర్ ఆకాష్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు జిల్లా అడిషనల్ SP సంజీవ రావు. కారు, ముందు ఉన్న వాహనాన్ని ఢీ కొట్టి వాహనం కంట్రోల్ కాక ORR పక్కన రెయిలింగ్ ని ఢీ కొట్టిందని చెప్పారు. ఆమె PA ఆకాష్(24) కాల్లు విరిగిపోయాయని.. అతను మియాపూర్ లోని శ్రీకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. సదాశివపేట మండలం ఆరూర్ లో ఉన్న దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులతో వెళ్లారని పేర్కొన్నారు. టిఫిన్ కోసం పటాన్ చెరు వైపు వెలుతున్న క్రమంలో ప్రమాదం జరిగిందని అడిషనల్ ఎస్పీ సంజీవరావు మీడియా సమావేశంలో తెలిపారు.